Snapchat 101

Snapchat అనేది 13 మరియు ఆ పై సంవత్సరాల వయసున్న ప్రజలకు కమ్యూనికేషన్స్ సేవ అందించేందుకు రూపొందించబడింది. ఇది టీనేజర్లు, మరియు యుక్తవయసులోని వయోజనులలో బహుళ ప్రాశస్త్యం పొందింది. వారు దీనిని ప్రధానంగా, తమ ఫ్రెండ్స్‌తో వాస్తవ జీవితంలో ఇంటరాక్ట్ చేసినట్లుగా మాట్లాడేందుకు ఉపయోగిస్తారు. ఇది ఇంతకుముందు తరాలవారు తమ ఫ్రెండ్స్‌తో సంబంధంలో ఉండేందుకు టెక్స్ట్ మెసేజింగ్ లేదా ఫోన్ ఉపయోగించినట్లుగానే ఉంటుంది. మీరు Snapchat ఉపయోగించకపోతే, యాప్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ సత్వర వివరణ ఉంది.

ప్రాథమికసూత్రాలు

ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన ఒక అనుభవం అందించడమే మా లక్ష్యం, ఈ ఉద్దేశ్యంతోనే మేము Snapchatను సామాజిక మాధ్యమాలనుండి భిన్నంగా రూపొందించాము. Snapchat, లైక్స్ మరియు వ్యాఖ్యలతో ఉండే ఒక అల్గోరిథం ఆధారంగా పనిచేస్తూ, పబ్లిక్ ఫీడ్‌కు బహిరంగంగా ఉంచబడలేదు. దానికి బదులుగా, ఈ యాప్, కెమెరాకు తెరుచుకుంటుంది మరియు దీనిలో ఐదు ట్యాబ్‌లు ఉన్నాయి: కెమెరా, చాట్, మ్యాప్, స్టోరీస్ మరియు స్పాట్‌లైట్. మరింత తెలుసుకొనేందుకు ఈ వీడియో చూడండి:

Snapchat, వివరించబడింది

Snapchatపై మెసేజింగ్ ఎలా పనిచేస్తుంది

Snapchatపై సంభాషణలు, వాస్తవ-జీవిత సంభాషణలను ప్రతిబింబించేందుకు డిఫాల్ట్‌గా డిలీట్ చేయబడుతాయి. సామాజిక మాధ్యమానికి ముందు, మన వినోదం, సమయస్ఫూర్తి, ఫ్రెండ్స్‌తో సరదాగా చేసే చిలిపిపనులు కేవలం మన జ్ఞాపకాలలో మాత్రమే ఉండేవి! Snapchat ఆ డైనమిక్ ప్రతిబింబించేలా, ప్రజలు ఏవిధమైన ఒత్తిడి లేదా పక్షపాతం లేకుండా తమను తాము వ్యక్తపరచడానికి మరింత సౌకర్యవంతంగా అనుభూతి చెందడానికి సహాయపడేందుకు రూపొందించబడింది.

Snapchatలోని సంభాషణలు డిఫాల్ట్‌గా డిలీట్ చేయబడతాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం, అయితే, టీనేజర్లు మరియు తల్లిందండ్రులనుండి హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన నివేదికలను సమీక్షించేందుకు డేటాను మేము మా వద్ద ఉంచుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, దీనిలో ఏదైనా చట్టం అమలు చేసే సంస్థలకు నివేదించేవికూడా ఉంటాయి. ఒకవేళ అధికారులు దీనిపై ఫాలో-అప్ చేయదలిస్తే, మేము ఈ డేటాను మరింత ఎక్కువకాలం మావద్ద ఉంచుకోవచ్చు మరియు నేరస్తులను చట్టం ముందుకు తీసుకురావడానికి మేము సంబంధిత అధికారులతో కలిసిపనిచేస్తాము.

తెలుసుకోవడం సహాయకారిగా ఉంటుంది! Snaps మరియు చాట్లు డిఫాల్ట్‌గా తొలగించబడవచ్చు, కాని ఎవరైనా ఒక వ్యక్తి సమ్మతిలేకుండా ఒక కంప్యూటర్ స్క్రీన్ లేదా ఫోన్ స్క్రీన్‌నుండి దానిని తీసుకోవచ్చు. ఏదైనా ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లుగా, ఎవరినైనా ప్రైవేట్ లేదా సున్నితమైన చిత్రాలు మరియు సమాచారాన్ని పంపమని కోరడం లేదా పంపడానికి - భాగస్వామికైనా లేదా ఫ్రెండ్‌కైనా - సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండటమనేది చాలా అవసరం.

కమ్యూనిటీ మార్గదర్శకాలు

మా సేవలను సురక్షితంగా ఉపయోగించడంలో Snapచాటర్లకు సహాయపడేందుకు మేము స్పష్టమైన కమ్యూనిటీ మార్గదర్శకాలు కలిగివున్నాము. ఈ నియమాలు చట్టవ్యతిరేక మరియు హానికలిగించేందుకు అవకాశమున్న కంటెంట్ మరియు లైంగికపరమైన దోపిడీ, పోర్నోగ్రఫీ, మాదకద్రవ్యాల చట్టవ్యతిరేక అమ్మకం, హింస, స్వీయ-హాని మరియు తప్పుడు సమాచారం వంటి ప్రవర్తనలను నిషేధిస్తాయి. విస్తృత స్థాయిలోని ప్రజలకు చేరువయ్యే ఈ నియమాలను ఉల్లంఘించే కంటెంట్‌ను నివారించడానికి మేము మా పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్, స్టోరీస్, మరియు స్పాట్‌లైట్‌లకు

అదనపు మోడరేషన్ విధానాన్ని వర్తింపజేస్తాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు పరచేందుకు మరియు సంభావ్య ప్రమాదాలను నివారించేందుకు, మేము ముందస్తు శోధనా సాధనాలను మరియు Snapచాటర్ల, తల్లిదండ్రులు మరియు చట్టం అమలుపరచే అధికారులనుండి స్వీకరించే నివేదికలను ఉపయోగిస్తాము. ఈ నివేదికలను విచారించేందుకు మేము 24/7 గ్లోబల్ ట్రస్ట్ మరియు సేఫ్టీ బృందాన్ని కలిగివున్నాము. చాలావరకు సందర్భాలలో, Snapchat యొక్క భద్రతా ప్రమాణాలను అమలు పరచేందుకు ఒక గంటలోపే వారు తగిన చర్య తీసుకొంటారు. ఈ చర్యలలో, యూజర్లను హెచ్చరించడం, కంటెంట్‌ను తొలగించడం, అకౌంట్ నిషేధించడం, మరియు చట్ట అమలుపరచే అధికారులకు తెలియజేయడంవంటివి ఉంటాయి.

టీనేజర్లకు సంరక్షణలు

Snapchatపై టీనేజర్లను సురక్షితంగా ఉంచడానికి మేము ఎలా సహాయపడతామో చూడండి.