తల్లిదండ్రులకు ఉపకరణాలు మరియు వనరులు

టీనేజర్లను వీలయినంత వరకు సంరక్షించేందుకు Snapchatపై మేము మా బాధ్యతను తీవ్రంగా తీసుకొంటాము. దీనిలో భాగంగా, టీనేజర్లు Snapchatను సురక్షితంగా ఉపయోగించడానికి తల్లిదండ్రులకు సహాయపడటానికి మేము వారికి కొన్ని ఉపకరణాలు మరియు వనరులతో సంసిద్ధం చేయాలనుకుంటున్నాము. ఇక్కడ మీరు, Snapchat యొక్క తల్లిదండ్రుల నియంత్రణలను ఎలా ఉపయోగించాలో తెలుసుకొంటారు, మీ టీనేజర్లతో చర్చించడానికి ముఖ్యమైన సురక్షణా సూచనల చెక్‌లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు నైపుణ్యవంతమైన మీ వనరులను యాక్సెస్ చేసుకోవచ్చు.

Snapchat తల్లిదండ్రుల నియంత్రణలు

Snapchat ఫ్యామిలీ సెంటర్ అనేది మీ టీనేజర్లు Snapchatపై ఎవరితో కమ్యూనికేట్ చూడటానికి మరియు కంటెంట్ కంట్రోల్స్- భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సంభాషణలను ప్రాంప్ట్ చేయడానికి సహాయపడేలా - సెట్ చేయడానికి ఉపకరించేందుకు మేమందిస్తున్న తల్లిదండ్రుల నియంత్రణ ఉపకరణం. ఫ్యామిలీ సెంటర్, తల్లిదండ్రులు మరియు టీనేజర్ల మధ్య వాస్తవ-ప్రపంచంలోని సంబంధాల డైనమిక్స్‌ను ప్రతిబింబిస్తుంది - ఇది తల్లిదండ్రులకు, వారి పిల్లలు యుక్తవయసులోని గోప్యతకు విలువనిస్తూనే, తమ సమయం ఎవరితో గడుపుతున్నారో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఫ్యామిలీ సెంటర్‌పై, తల్లిదండ్రులు, తమ సమస్యను సులభంగా మరియు గోప్యంగా, Snapచాటర్ల భద్రతకై ఇరవైనాలుగ్గంటలూ పనిచేసే మా ట్రస్ట్ మరియు సేఫ్టీ బృందానికి రిపోర్ట్ చేయవచ్చు.

ఫ్యామిలీ సెంటర్‌ను ఉపయోగించడం

ఫ్యామిలీ సెంటర్ ఉపయోగించడానికి, తల్లిదండ్రులకు ఖచ్చితంగా Snapchat అకౌంట్ ఉండాలి. యాప్‍ను డౌన్‌లోడ్ చేసుకొని, ఫ్యామిలీ సెంటర్‌ను సెటప్ చేసుకోవడానికి సూచనలు ఇక్కడ ఇవ్వబడినాయి:

అంచెలవారీగా సూచనలకై చదవండి లేదా ఈ ట్యుటోరియల్ చూడండి.

స్టెప్ 1

Snapchatను మీ మొబైల్ ఫోన్‌లోకి Apple App Store లేదా Google Play స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రారంభించండి.
ఫ్యామిలీ సెంటర్ గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మా సపోర్ట్ సైట్ సందర్శించండి.

భద్రతా చెక్‌లిస్ట్‌

తల్లిదండ్రుల కొరకు

Snapchatను సురక్షితంగా ఎలా ఉపయోగించాలో అనేదాని గురించి మద్దతు సంభాషణలకు, మీ టీనేజర్లకు సహాయకారిగా ఉండే ఒక ముఖ్యమైన సూచనల చెక్‌లిస్ట్‌:
కేవలం కుటుంబం మరియు ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవండి
మీకు వాస్తవజీవితంలో తెలిసిన ప్రజలకు మాత్రమే ఫ్రెండ్ ఆహ్వానం పంపండి మరియు వారి ఆహ్వానాన్ని మాత్రమే అంగీకరించండి.
ఒక యూజర్ నేమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోండి
మీ యూజర్ నేమ్‌లో వారి వయస్సు, పుట్టినతేదీ, వ్యక్తిగత సమాచారం లేదా సూచించబడిన భాషలేకుండా జాగ్రత్తగా ఎంచుకోండి. యుక్తవయస్సులోని మీ పిల్లల యూజర్ నేమ్‌లో వయస్సు లేదా పుట్టినతేదీ వంటి వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ ఉండకూడదు.
ఒక సరైన వయస్సుతో సైన్ అప్ చేయండి
మా వయస్సు-సంబంధిత భద్రతా చర్యలనుండి తగిన లాభం పొందడానికి, మీ టీనేజర్ ఖచ్చితమైన పుట్టినతేదీని కలిగివుండటం ఒక్కటే సరైన మార్గం.
లొకేషన్-షేరింగ్‌ను మరోసారి సరిచూసుకోండి
మా మ్యాప్‍పై లొకేషన్-షేరింగ్ అనేది అందరికీ డిఫాల్ట్‌గా ఆఫ్ చేయబడి ఉంటుంది. ఒకవేళ మీ టీనేజర్ దానిని ఆన్ చేయాలనుకొంటే, అది నమ్మకమైన వారి ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో మాత్రమే ఉపయోగించాలి.
ఒక విశ్వసనీయ పెద్దవారితో మాట్లాడండి
భద్రత మరియు శ్రేయస్సుల విషయానికి సంబంధించి, తప్పుడు ప్రశ్నలు లేదా సంభాషణలు లేవు. మీ టీనేజర్ కు ఏదైనా ఇబ్బంది కలిగివుంటే, వారిని విశ్వసనీయమైన పెద్దవారితోో మాట్లాడమని చెప్పండి.
ఇన్-యాప్ రిపోర్టింగ్ ఉపయోగించండి
రిపోర్ట్‌లు గోప్యంగా ఉన్నాయని మీ టీనేజర్ తెలుసుకోవాలి - వాటిని సమీక్షించేందుకు నేరుగా మా 24/7 ట్రస్ట్ మరియు సేఫ్టీ బృందానికి వెళ్లాలి.
పంపడానికి ముందు ఆలోచించండి
ఏదైనా ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లుగా, ఎవరినైనా ప్రైవేట్ లేదా సున్నితమైన చిత్రాలు మరియు సమాచారాన్ని పంపమని కోరడం లేదా పంపడానికి - భాగస్వామికైనా లేదా ఫ్రెండ్‌కైనా - సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండటమనేది చాలా అవసరం.
Snapchat ఫ్యామిలీ సెంటర్‌లో చేరండి
మీ టీనేజర్లు ఏ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారో చూడటానికి మరియు కంటెంట్ కంట్రోల్స్ సెట్ చేయడానికి, మీరు మరియు మీ టీనేజర్లు, మా తల్లిదండ్రుల నియంత్రణలు Snapchat ఫ్యామిలీ సెంటర్‌కు సైనప్ అయ్యారని నిర్ధారించుకోండి.

తెలుసుకోవడం సహాయకారిగా ఉంటుంది! ఈ చెక్‌లిస్ట్ యొక్క ఒక డౌన్‌లోడ్ చేయగల వెర్షన్ ప్రింట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.. అదనపు సమాచారానికై, తల్లిదండ్రులు మరియు నిపుణుల నుండి భద్రతా వనరులను చూడండి.