Snapchat ఫ్యామిలీ సేఫ్టీ హబ్

Snapchat ప్రధానంగా ఇతర సాంప్రదాయ సామాజిక మాధ్యమాలకు భిన్నంగా, సన్నిహిత మిత్రులు మరియు కుటుంబంతో, భద్రత మరియు గోప్యతలకు ప్రాధ్యాన్యాన్నిచ్చే వాతావరణంలో కమ్యూనికేషన్లను పెంపొందించుకొనే ప్రధానోద్ద్యేశ్యంతో రూపొందించబడినది. Snapchat ఎలా పనిచేస్తుంది, టీనేజర్లకు మేమందించే ప్రధాన రక్షణలు మరియు మా భద్రతా టూల్స్ ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోండి.

తల్లిదండ్రుల కోసం భద్రతా మార్గదర్శకాలు

Snapchat అంటే ఏమిటి?

Snapchat అనేది 13 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుండేవారికి కమ్యూనికేషన్ కోసం రూపొందించబడిన ఒక సేవ. ఇది టీనేజర్లు, మరియు యువకులలో, ప్రధానంగా తమ ఫ్రెండ్స్‌తో నిజ జీవితంలో ఇంటరాక్ట్ చేసినట్లుగా మాట్లాడేందుకు ఉపయోగిస్తున్నందున ప్రాచుర్యం పొందింది.

Snapchatపై టీనేజర్ల కొరకు రక్షణ

సన్నిహిత స్నేహితులతో కనెక్ట్ కావడం, అపరిచితుల నుండి అవాంఛిత సంబంధాన్ని నిరోధించడం మరియు వయస్సుకు తగిన కంటెంట్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టడంలో సహాయపడటానికి మేము Snapchatలో అదనపు టీనేజ్ రక్షణలనుఅందిస్తాము.

Snapchat ఫ్యామిలీ సెంటర్ గురించి

టీనేజర్లను వీలయినంత వరకు సంరక్షించేందుకు Snapchatపై మేము మా బాధ్యతను తీవ్రంగా తీసుకొంటాము. దీనిలో భాగంగా, టీనేజర్లు Snapchatను సురక్షితంగా ఉపయోగించడానికి తల్లిదండ్రులకు సహాయపడటానికి మేము వారికి కొన్ని ఉపకరణాలు మరియు వనరులతో సంసిద్ధం చేయాలనుకుంటున్నాము.

తల్లిదండ్రులు కోసం Snapchat లో వీడియో వనరులు

Snapchat అంటే ఏమిటి, మీ కుటుంబం కనెక్ట్ అయివుండేందుకు ఏవిధంగా సహాయపడుతుంది, మరియు టీనేజర్లు భద్రంగా ఉండేందుకు Snapchat ఏరకమైన భద్రతలను కలిగివుందో అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలను అన్వేషించండి.

Snapchat గురించి

Snapchat మీ సన్నిహిత ఫ్రెండ్స్‌తో వ్యక్తపరచే సంభాషణలను ప్రోత్సహించడానికి నిర్మించబడింది మరియు Snapchatపై టీనేజర్లకు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన అనుభవం అందించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము.


తరచుగా అడిగే ప్రశ్నలు

Snapchat అంటే ఏమిటి?

Snapchat అనేది చాలా మంది తమ నిజమైన ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో చాటింగ్, స్నాపింగ్ (Snapలు/చిత్రాల ద్వారా మాట్లాడటం), లేదా వాయిస్ మరియు వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగించే ఒక కమ్యూనికేషన్ సేవ.

Snapchatలో వయోపరిమితి ఉందా?

Snapchat అకౌంట్ ను సృష్టించడానికి టీనేజర్లకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ ఒక అకౌంట్ 13 కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి చెందినదని మేము నిర్ణయించినట్లయితే, మేము వారి అకౌంట్‍ను ప్లాట్‍ఫామ్ నుండి రద్దుచేసి, వారికి సంబంధించిన సమాచారం తొలగిస్తాము.

టీనేజర్లు తమ ఖచ్చితమైన పుట్టినతేదీతో సైనప్ చేయాలి అందువల్ల, వారు టీనేజర్లకు Snapchat అందించే రక్షణల యొక్క ప్రయోజనం పొందగలుగుతారు. టీనేజర్లు ఈ రక్షణలను అధిగమించకుండా నిరోధించడానికి, ఇప్పటికే Snapchat అకౌంట్ను కలిగి ఉన్న 13-17 సంవత్సరాల వయస్సు గల వారు వారి పుట్టిన సంవత్సరాన్ని 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి మార్చడానికి మేము అనుమతించము.

Snapchat టీనేజర్లను ఎలా రక్షిస్తుంది?

సన్నిహిత స్నేహితులతో కనెక్ట్ కావడం, అపరిచితుల నుండి అవాంఛిత సంబంధాన్ని నివారించడం మరియు వయస్సుకు తగిన కంటెంట్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టడంలో సహాయపడటానికి Snapchatలోని టీనేజర్లకు మేము అదనపు రక్షణలను అందిస్తాము.

ఆందోళన కలిగించే భద్రతా అంశాన్ని నేను Snapchatపై ఎలా నివేదించాలి?

ఆందోళన కలిగించే ఒక అంశంగురించి టీనేజర్లు మరియు తల్లిదండ్రులు మాకు నివేదించేందుకు - యాప్‍పై నేరుగా లేదా Snapchat అకౌంట్ లేనివారు ఆన్‍లైన్లో రిపోర్ట్ చేసేలా మేము సులభమైన మార్గాలనుఅందిస్తున్నాము.

Snapchat గోప్యతా సెట్టింగులు కలిగివుందా?

అవును, మరియు డిఫాల్ట్ గా, Snapchat లోని టీనేజర్ల కొరకు కీలక భద్రతా మరియు గోప్యతా సెట్టింగ్ లను మేము కఠినమైన ప్రమాణాలకు సెట్ చేస్తాము. 

వినియోగదారులందరికీ కాంటాక్ట్ సెట్టింగ్ లు స్నేహితులు మరియు ఫోన్ కాంటాక్ట్ లకు మాత్రమే సెట్ చేయబడతాయి మరియు విస్తరించబడవు. 

లొకేషన్ పంచుకోవడం డిఫాల్ట్ గా ఆఫ్ చేయబడి ఉంటుంది. మా Snapchat మ్యాప్‍లోని లొకేషన్-షేరింగ్ ఫీచర్‍ను ఉపయోగించాలని Snapచాటర్లు నిర్ణయించుకుంటే, వారు ఇప్పటికే మిత్రులుగా ఉన్న వ్యక్తులతో మాత్రమే వారి లొకేషన్ ని పంచుకోగలరు. ఫ్రెండ్‍గా లేనివారితో లొకేషన్ పంచుకునే ఆప్షన్ ఎప్పుడూ లేదు.

ఫ్యామిలీ సెంటర్ అంటే ఏమిటి, మరియు నేను దానిని యాక్సెస్ ఎలా చేయగలను?

ఫ్యామిలీ సెంటర్ అనేది మా ఇన్-యాప్ వనరు, ఇది తల్లిదండ్రులకు వారి టీనేజ్ ఎవరితో స్నేహితులు మరియు వారు ఇటీవల ఎవరికీ సందేశాలు పంపారో చూడడం, వారి పిల్లల యొక్క లొకేషన్ ని అభ్యర్థించడం, Snapchat లో వారి పిల్లల యొక్క గోప్యత మరియు భద్రతా సెట్టింగ్ లను వీక్షించడం వంటి మరియు మరెన్నో చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది.